![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 112 లో.. రామలక్ష్మి, సిరి, సీతాకాంత్ కలిసి పానీపూరి తినడానికి వెళ్తారు. అక్కడ సీతాకాంత్ పానీపూరి తిననని అనగా.. సర్ ప్లీజ్ తినండి నాకోసం.. మీరు తింటే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని రామలక్ష్మి అనగానే.. నీకోసం తింటానని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత తను ఇబ్బంది పడుతుంటే రామలక్ష్మి ఎలా తినాలో చూపిస్తుంది. ఇది నిజంగా ఎనిమిదో వింత.. మా అన్నయ్య నీకోసం తనకి ఇష్టం లేని ఫుడ్ ని తింటున్నాడు.. నువ్వంటే ఎంత ప్రేమో చూడని సిరి అనగానే రామలక్ష్మి, సీతాకాంత్ కాస్త ప్రేమగా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ కోసం ఆన్ లైన్ లో ఓ వీడియో ఇంటర్వ్యూకి రామలక్ష్మి అటెండ్ అవుతుంది. ఇక సీతాకాంత్ తనకి దగ్గరుండి ఎలా అటెండ్ అవ్వాలో చెప్తాడు. దాంతో తను ఇంటర్వ్యూ బాగా అటెండ్ చేస్తుంది. ఆ తర్వాత ఢిల్లీలో ట్రైనింగ్ కి రామలక్ష్మి సెలెక్ట్ అవుతుంది. ఇక చాలా ఆనందంతో ఉన్న రామలక్ష్మి.. మీ వల్లే ఇదంతా సాధ్యమైందని సీతాకాంత్ కి థాంక్స్ చెప్తుంది రామలక్ష్మి. ఇక సీతాకాంత్ డల్ గా ఉంటాడు. వాళ్ళ తాతయ్య చూసి ఏంటి సీతా డల్ గా ఉన్నావని అడుగగా.. రామలక్ష్మి ఢిల్లీ వెళ్ళిపోతుందని సీతాకాంత్ చెప్తాడు. తను వెళ్ళేలోపే నీ ప్రేమ విషయాన్ని చెప్పమని చెప్తాడు. మరోవైపు అభి దొరికాడంటూ శ్రీలతకి సందీప్ ఫోన్ చేసి చెప్తాడు. ఇక కాసేపటికి అభి దగ్గరికి శ్రీలత వస్తుంది. మీరు సీతాకాంత్ కి అమ్మ, మీరు సీతాకాంత్ కి తమ్ముడు.. మీ మాటలు ఎలా నమ్మాలని అభి అంటాడు. నాకు ఒక్కడే కొడుకు సందీప్.. ఆ ఆస్తి అంతా నా కొడుకే దక్కాలని నా ప్లాన్ అని శ్రీలత అంటుంది. నీ కోసం ఎంతో వెతికాం.. శత్రువుకి శత్రువు మిత్రుడు. అందుకే నువ్వు మాతో కలిస్తే ఆ సీతాకాంత్ ని మానసికంగా దెబ్బ కొట్టొచ్చని అభితో సందీప్, శ్రీలత అంటారు.
సీతాకాంత్ చేసిన దానికి అతని మీద కోపంతో ఉన్న అభి.. శ్రీలత, సందీప్ వాళ్ళతో చేతులు కలుపుతాడు. మరోవైపు సిరి, ధన తమకి పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటు ఉంటారు. మన బిడ్డ పుట్టిన తర్వాత మనం కూడా ఇలాగే ఫోటో దిగుదామా అని సిరి అనగానే.. సరేనని ధన అంటాడు. అప్పుడే రామలక్ష్మి జ్యూస్, ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి సిరిని వేస్కోమంటుంది. మీకు పుట్టబోయే బిడ్డకి ఏ పేరు పెట్టాలనుకుంటారని సిరి, ధనలని రామలక్ష్మి అడుగగా.. ఇంకా లేదని అంటుంది. అసలు నువ్వు చెప్పాలి. త్వరలో మీకు పుట్టబోయే బిడ్డకి ఏ పేరు పెట్టాలని అనుకుంటున్నారని సిరి అడుగగా.. రామలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఇక అదంతా సీతాకాంత్ విని.. రామలక్ష్మిని పిలుస్తాడు. కాఫీ ఇవ్వమని చెప్పగా రామలక్ష్మి ఇస్తుంది. రామలక్ష్మిపై ప్రేమని ఇప్పుడే చెప్పమని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ తో అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ ఆగాల్సిందే.
![]() |
![]() |